20 November 2018

ఏపీ డీఎస్సీ - డిసెంబరు 1 నుంచి హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌

ఆంధ్ర ప్ర‌దేశ్ లో డీఎస్సీ -2018కి మొత్తం 6,08,157 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో పోస్టుకు సరాసరిన 79 మంది పోటీ పడుతున్నారు. అత్య‌ధికంగా ఎస్‌జీటీ పోస్టుల‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 6,26,791మంది దరఖాస్తు రుసుము చెల్లించగా.. 6,08,157 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు.

ఆన్‌లైన్ ప‌రీక్ష‌లు...

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఈనెల 22 నుంచి డిసెంబరు 9వరకు ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలకు ఐచ్ఛికాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పాఠ‌శాల‌ విద్యాశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చు.

హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌:

డీఎస్సీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబరు ఒకటో తేదీ నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప‌రీక్ష‌లు కూడా ఆన్‌లైన్‌లోనే జ‌ర‌గ‌నున్నాయి.

Latest Jobs