Search for job details

07 December 2018

APPSC Asst Motor Vehicle Inspector Vacancies - AVMI Recruitment 2018

ఏపీలో అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్లు - 23 ఖాళీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఏపీ ట్రాన్స్‌పోర్ట్ స‌బార్డినేట్ స‌ర్వీస్‌లో అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్  (ఏవీఎంఐ) పోస్టుల భ‌ర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ - ఏపీపీఎస్సీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

పోస్టు పేరు: అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్లు
మొత్తం పోస్టుల సంఖ్య‌: 23
జోన్ల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి...
1) జోన్‌-1: 04
2) జోన్‌-2: 06
3)జోన్‌-3: 07
4) జోన్‌-4: 06

అర్హ‌త వివ‌రాలు:
అభ్య‌ర్థ‌లు మెకానిక‌ల్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ (లేదా) ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు మోటార్ డ్రైవింగ్ లైసెన్స్(3సం. అనుభ‌వం) ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు కూడా ఉండాలి.

వ‌య‌సు: 01.07.2018 నాటికి 21-34 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం:
స్క్రీనింగ్ (ప్రిలిమిన‌రీ), మెయిన్, వైద్య ప‌రీక్షల ఆధారంగా.
స్క్రీనింగ్ టెస్ట్ తేది: ఇంకా వెల్ల‌డించాల్సి ఉంది. వెబ్‌సైట్ ద్వారా ప్ర‌క‌టిస్తారు.
మెయిన్ ఎగ్జామినేష‌న్ తేది: 17.04.2019.

ద‌ర‌ఖాస్తు ఎలా?

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేది: 12.12.2018.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 02.01.2019.