Search for job details

07 December 2018

APPSC Forest Range Officers - FRO Recruitment 2018

ఏపీలో ఉద్యోగ నియామ‌కాల సంద‌డి కొన‌సాగుతుంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫారెస్ట్ స‌ర్వీస్‌లో ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీస‌ర్ (ఎఫ్ఆర్వో) పోస్టుల భ‌ర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద‌ర‌ఖాస్తులు కోరుతూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఖాళీల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు స‌మాచారం కింద ఇస్తున్నాం.

పోస్టు: ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్లు (ఎఫ్ఆర్వో)
మొత్తం పోస్టుల సంఖ్య‌: 24
జోన్ల‌వారీగా ఖాళీలు:
1) జోన్‌-1: 11
2) జోన్‌-2: 03
3) జోన్‌-3: 01
4) జోన్‌-4: 09
అర్హ‌త‌: అగ్రిక‌ల్చ‌ర్, బోట‌నీ, కెమిస్ట్రీ, కంప్యూట‌ర్ అప్లికేష‌న్/ క‌ంప్యూట‌ర్ సైన్స్, ఇంజినీరింగ్ (అగ్రిక‌ల్చ‌ర్‌/ కెమిక‌ల్/ సివిల్/ కంప్యూట‌ర్/ ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్/ మెకానిక‌ల్), ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాల‌జీ, హార్టిక‌ల్చ‌ర్, మ్యాథ‌మేటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్‌, వెట‌ర్న‌రీ సైన్స్, జువాల‌జీ స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. నిర్డిష్ట శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.

వ‌య‌సు: 01.07.2018 నాటికి 18-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్ ప‌రీక్ష‌లు, ఫిజిక‌ల్ ప‌రీక్ష‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్ తేది: 24.02.2019.
మెయిన్ ప‌రీక్ష తేది: 2019 ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.250తోపాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.120.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభ‌ తేది: 10.12.2018.
ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 31.12.2018.