27 December 2018

ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ ఫలితాలు విడుద‌ల

ఆంధ్ర ప్ర‌దేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వ‌హించిన సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ ప్రాథ‌మిక / స‌్క్రీనింగ్ / ప‌్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఫలితాలను పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్ 26 డిసెంబ‌రున విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,22,160 మంది హాజర‌య్యారు. వీరిలో దేహ‌దారుఢ్య ప‌రీక్ష‌ల‌కు 51,926 మంది అర్హత సాధించారు.

అభ్య‌ర్థుల ఓఎంఆర్ ఆన్స‌ర్ షీట్ల‌ను పోలీస్ నియామ‌క మండలి వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చ‌నున్నారు. అభ్య‌ర్థులు ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే ఈ నెల 28 నుంచి 30లోపు త‌మ అభ్యంత‌రాల‌ను వెబ్‌సైట్ ద్వారా తెలియ‌జేయాలి.

దేహ‌దారుఢ్య ప‌రీక్ష‌లు

ప్రాథ‌మిక ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన వారికి జ‌న‌వ‌రి 18 నుంచి విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలు ప్రాంతాల్లో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారని నియామ‌క మండ‌లి చైర్మ‌న్ విశ్వజిత్‌ ఓ ప్రకటనలో తెలిపారు.