Search for job details

07 December 2018

TSPSC Releases VRO Exam Results - 2018

టీఎస్‌పీఎస్సీ వీఆర్వో పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ వీఆర్వో ఉద్యోగ నియామక రాత పరీక్ష ఫలితాలను వెల్లడించింది. ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులను వెల్ల‌డించినట్టు తెలిపింది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్వో ఉద్యోగాల కోసం సెప్టెంబర్‌ 16న టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాత పరీక్ష ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఈ పరీక్షకు అధికారులు 2,945 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 7,87,049 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు.

రాతపరీక్షలో ఉత్తీర్ణులైన 7,38,885 మందికి మార్కులు, ర్యాంకులను టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగానికి ముగ్గురిని ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. ధృవ‌ప‌త్రాల ప‌రిశీల‌న అనంత‌రం అంతిమంగా ఎంపికైన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తారు.