23 January 2019

AP Constables Prelims Results Announced 2019 - Revaluation Process

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్ఎల్ పీఆర్‌బీ) కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాల‌ను విడుద‌ల చేసింది. ప్రిలిమిన‌రీ రాత ప‌రీక్ష ఫ‌లితాల‌ను అభ్య‌ర్థులు పోలీస్ నియామ‌క సంస్థ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవ‌చ్చు.

కానిస్టేబుల్‌  రాత పరీక్షకు ఏపీలో 3,51,860 మంది అభ్యర్థులు హాజ‌ర‌య్యారు. వీరిలో  1,09,106 మంది త‌ర్వాతి ద‌శ‌ల‌కు అర్హ‌త సాధించారు. అభ్య‌ర్థ‌లు ఎవ‌రైనా ఓఎంఆర్‌ షీట్స్‌ను పునర్‌మూల్యాకనం  చేయించాలనుకుంటే ఆ అభ్యర్థులు రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఈ మేర‌కు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ విశ్వజిత్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప్ర‌శ్న‌ప‌త్రాల / స‌మాధాన ప‌త్రాల పున‌ర్‌మూల్యాంకనం కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో 23 జ‌న‌వ‌రి 2019 ఉదయం 11 గంటల నుంచి జ‌న‌వ‌రి 25వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

ప్రిలిమిన‌రీలో ఉత్తీర్ణులైన అభ్య‌ర్థుల‌కు త‌ర్వాతి ద‌శ శారీర‌క సామ‌ర్థ్య ప‌రీక్ష‌లు, మెయిన్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. మెయిన్ ప‌రీక్ష‌లో మార్కుల ఆధారంగానే అభ్య‌ర్థుల‌ను అంతిమంగా పోస్టుల‌కు ఎంపిక చేస్తారు.

Latest Jobs