27 May 2019

APPSC Group 1 Prelims Key for Paper 1 and Paper 2

గ్రూప్-1 పోస్టుల భర్తీలో భాగంగా ఆంధ్ర ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ - ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 258 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్ 1.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహించారు.

ప్ర‌శ్న‌ప‌త్రంలో స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. పంచాయతీ కార్యదర్శి, గ్రూప్-2 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల మాదిరిగానే గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్లలోనూ అనువాద దోషాలున్నాయి. దీంతో తెలుగు మీడియంలో  గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అనేక ఆంగ్లపదాలనే తెలుగులో ఇవ్వడంతో అభ్యర్థులు చాలామంది ప్ర‌శ్న‌లు అర్థంకాక తికమకపడ్డారు.

మ‌రోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే ఏపీపీఎస్సీ అనేక సెంట‌ర్ల‌లో రేకుల షెడ్డుల్లో పరీక్షలు నిర్వహించడం పట్ల కొందరు అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. 169 గ్రూప్-1 కేట‌గిరీ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేయగా.. లక్షా 14 వేల 473 మంది దరఖాస్తు చేసుకున్నారు.

గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ కీ కోసం ఈనాడు ప్ర‌తిభ‌, సాక్షి ఎడ్యుకేష‌న్ వెబ్‌సైట్‌ల‌ను చూడ‌గ‌ల‌రు. ఏపీపీఎస్సీ అఫీషియ‌ల్ కీని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

Latest Jobs