08 October 2019

DSC 2018 Final Selection List for Total 7902 Posts

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ డీఎస్సీ - 2018 అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. విజయవాడలో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తుది విడత ఎంపిక జాబితాను అక్టోబ‌రు 3 లేదా 4న విడుదల చేస్తామన్నారు. 

కోర్టు కేసుల కారణంగా కొన్ని పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయని, కేసుల్లో విద్యాశాఖ కౌంటర్‌ దాఖలు చేసిందని తెలిపారు. మొదటి ప్రొవిజనల్‌ ఎంపిక జాబితాలో తిరస్కరించిన అభ్యర్థుల స్థానంలో.. మెరిట్‌ అభ్యర్థులకు రెండో జాబితాలో చోటిచ్చామని చెప్పారు. పోస్టుగ్రాడ్యుయేట్‌, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ అభ్యర్థుల రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందన్నారు.

పోస్టుల భర్తీ ఇలా..

* మొత్తం పోస్టులు: 7,902
* కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్నవి: 4,638
* ఎంపికకు మొదటి ప్రొవిజనల్‌ జాబితాలో విడుదల చేసినవి: 3,264
* ఇప్పటి వరకు నియామక అర్హత సాధించినవారు: 1,885
* తిరస్కారానికి గురైన అభ్యర్థులు: 855
* క్రీడలు, వికలాంగ కోటా ధ్రుపత్రాల పరిశీలన పెండింగ్‌లో ఉన్నవి: 142
* రిజర్వేషన్ల కోటాలో అభ్యర్థుల్లేక ఖాళీగా ఉన్న పోస్టులు: 382